అభివృద్ధి చేశాను.. మరో ఛాన్స్‌‌‌‌ ఇవ్వండి : పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి

నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరో ఛాన్స్‌‌‌‌ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి చెప్పారు. వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటలో బుధవారం జరిగిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. ఎన్నికల టైంలో వచ్చే లీడర్లకు గుణపాఠం చెప్పాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం బీసీ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్‌‌‌‌ తన అనుచరులతో కలిసి పెద్ది సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు.