తగ్గిన సోలార్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్‌‌‌‌‌‌‌‌..ముడి సరుకులు సేకరించడంపై డెవలపర్ల ఫోకస్‌‌‌‌‌‌‌‌

తగ్గిన సోలార్  ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్‌‌‌‌‌‌‌‌..ముడి సరుకులు సేకరించడంపై డెవలపర్ల ఫోకస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్‌‌‌‌‌‌‌‌ సామర్ధ్యం ( సోలార్ కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కోసం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు పూర్తవ్వడం, ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వంటివి)  47 శాతం  తగ్గి (ఇయర్ ఆన్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 5.6 గిగా వాట్లుగా నమోదయ్యాయని మెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ఇండియా వెల్లడించింది. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో 10.5 గిగా వాట్ల సామర్ధ్యం ఉన్న సోలార్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్‌‌‌‌‌‌‌‌ జరిగాయి. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు పూర్తవ్వడానికి టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుండడంతోనే ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్ తగ్గాయని మెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ వెల్లడించింది.  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  1.9 గిగా వాట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన 2.8 గిగా వాట్లతో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ.

కానీ, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే మాత్రం 1.8 గిగా  వాట్ల నుంచి 6 శాతం పెరిగాయని మెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ వెల్లడించింది. ‘ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 5.6 గిగా వాట్ల సామర్ధ్యం ఉన్న సోలార్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్ జరిగాయి. కిందటేడాది మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10.5 గిగా వాట్లుగా నమోదయ్యింది’ అని మెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతాయని అంచనా వేసింది. ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ కాస్ట్ తక్కువగా ఉండడంతో డెవలపర్లు ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (సేకరణ) పై ఎక్కువ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారని, వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారిగా ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్‌‌‌‌‌‌‌‌ పెరగొచ్చని అంచనా వేసింది.

చైనా నుంచి సోలార్ మాడ్యుల్స్ సప్లయ్ విపరీతంగా పెరగడంతో ధరలు తగ్గాయని తెలిపింది.   పెద్ద సైజ్ సోలార్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు కూడా వచ్చే ఏడాది పూర్తి కావొచ్చని పేర్కొంది. ల్యాండ్ సేకరణలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్ మధ్య మొదలు కాలేకపోయాయని మెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ వివరించింది.