నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్ డివిజనల్లో అభివృద్ధి అటకెక్కింది. నిధులు కేటాయించినా విడుదల కాకాపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. చాలా డివిజన్లలో డ్రైనేజీ సమస్యలు వెంటాడుతున్నాయి. పనులు చేయాలనే ప్రతిపాధనలు వస్తున్నప్పటికీ చర్చించేందుకు జనరల్‌బాడీ మీటింగ్‌ను పది నెలలు అవుతున్నా పెట్టడం లేదు. అంతకు ముందు మీటింగ్‌లు నామ్‌కే వాస్తేగా జరిపి డివిజన్‌కు రూ. 10 లక్షలు కేటాయించారు. కానీ ఆ నిధులను ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. మరోవైపు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న డివిజన్లకు కార్పొరేషన్ నిధులు అదండం లేదని, అభివృద్ధిని అధికార పార్టీ అడ్డుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి.
దిక్కులేని జనరల్ బాడీ
కార్పొరేషన్ పాలకవర్గం కొలువుదీరి రెండున్నరేండ్లు కావొస్తోంది. నిబంధనల ప్రకారం.. ప్రతి మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరగాలి. కానీ అలా చేయడం లేదు. దీంతో నగరంలో అభివృద్ధి పై చర్చ జరగడం లేదని సభ్యులు అంటున్నారు. ఇప్పటికీ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్యహించక 10 నెలలు అవుతోంది. కిందటి ఏడాది మార్చి 12న, డిసెంబర్ 29న మీటింగ్ నిర్వహించగా.. నేటికీ మీటింగ్ ఊసే లేదు. కరోనా పేరుతో కార్పొరేషన్ మీటింగ్ లు ఎలాగూ నిర్వహించలేదు. వర్చువల్ గా నిర్వహించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత ప్రత్యక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే నగరాభివృద్ధిపై చర్చజరగాల్సి ఉండగా.. మీటింగ్ లు వాయిదా వేయడంతోనే సరిపోయింది. ఇప్పటివరకు 10 మీటింగ్ లు జరగాల్సి ఉండగా 5 మీటింగ్ లు మాత్రమే నిర్వహించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు మీటింగ్‌లలో కూడా మూడు బడ్జెట్ మీటింగ్ లు కావడంతో సమస్యలపై ఎలాంటి చర్చా జరుగలేదు. మూడో బడ్జెట్ మీటింగ్‌లో పట్టణ ప్రగతి స్కీమ్ కింద మొత్తం నిధులు రూ. 6కోట్లతో ప్రతి డివిజన్ కు రూ.10 లక్షలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మీటింగ్ పెట్టకపోవడంతో ఈ ఫండ్స్ గురించి అడిగే పరిస్థితి లేదని కార్పొరేటర్లు చెప్తున్నారు. ఇప్పటికైనా మీటింగ్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మీటింగ్ పెట్టడం లేదు
కార్పొరేషన్ మీటింగ్ లు సరిగ్గా పెడ్తలేరు. అభివృద్ధి, సమస్యలపై చర్చించడంలేదు. డివిజన్ కు జనరల్ ఫండ్ కింద రూ. 10 లక్షలను కాగితాలకే పరిమితం చేసిన్రు. బీజేపీ కార్పొరేటర్ల డివిజన్ లలో అభివృద్ధిని అధికార పార్టీ అడ్డుకుంటోంది. మీటింగ్ లేక అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు పరిష్కారమవుతలేవు.
- స్రవంతిరెడ్డి, ఫ్లోర్ లీడర్, బీజేపీ
అభివృద్ధి కనిపిస్తలేదు ..
అర్బన్ డెవలప్మెంట్ పై టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోంది.నగర డెవలప్మెంట్ పై అధికారపార్టీ దృష్టి పెట్టడంలేదు. సమస్యల తీవ్రతను కౌన్సిల్ పట్టించుకుంటలేదు. కౌన్సిల్ మీటింగ్ లు మున్సిపల్ యాక్ట్ ప్రకారం జరిపించాలె. పది నెలల నుండి మీటింగ్ లు జరుగుతలేవు. ఇప్పటికైనా డెవలప్మెంట్ ఫండ్స్ ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలే.
- గడుగు రోహిత్ , కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్
ఆలయ పునఃనిర్మాణానికి భూమిపూజ
డిచ్పల్లి, వెలుగు: మండలంలోని రాంపూర్ లో లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ నుంచి రూ.8 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రూ. 32 లక్షలతో ఆలయాన్ని పున: నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అనంతరం ఆ గ్రామానికి రూ.2.5 లక్షల గల వైకుంటరథం డొనేట్ చేసిన మర్రి ఉదయ్ కుమార్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ రమేశ్, పీఏసీఎస్ చైర్మెన్ తారాచంద్, లీడర్లు లక్ష్మినర్సయ్య, రవి, రాజ్‌కుమార్, పద్మారావు, లింగంయాదవ్, సాయిలు, రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు.
గురుపూజోత్సవానికి రండి..
నిజామాబాద్ టౌన్, వెలుగు:ఈనెల 28న బసవ గార్డెన్ లో జరిగే గురుపూజోత్సవానికి హాజరుకావాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎంపీ ఆర్వింద్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎంపీని కలిసిన వారిలో ఆ సంఘం అధ్యక్షులు గాండ్ల వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు బద్రీనాథ్, సభ్యులు శివాజీ, రుద్ర మదు, సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు.
బిచ్కుంద డిగ్రీ కాలేజీ సందర్శించిన న్యాక్‌బృందం
పిట్లం, వెలుగు: బిచ్కుంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని న్యాక్ బృందం బుధవారం విజిట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ ఏపీ తివారి, తమిళనాడుకు చెందిన డాక్టర్ శ్రీమాన్ నారాయణ, కర్నాటకకు చెందిన డాక్టర్ సన్న బసనగౌడ కాలేజీని సందర్శించారు. ప్రిన్సిపల్ చంద్ర ముఖర్జీ, ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారికి స్వాగతం పలికారు. మౌలిక వసతులు, ల్యాబ్, కంప్యూటర్లు, సామాజిక సేవ కార్యక్రమాలను న్యాక్ బృందానికి వివరించారు. అనంతరం కాలేజీలో ల్యాబ్‌లు, క్లాస్రూంలు, మైదానం, గ్రీనరీలను పరిశీలించారు. ప్రస్తుతం సీ గ్రేడ్ ఉన్న కాలేజీ ఏ గ్రేడ్ సాధించేందుకు కృషి చేస్తున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు. రెండో రోజు కూడా న్యాక్‌బృందం పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు. వారితో పాటు కాలేజీ సిబ్బంది వెంకటేశం, శ్రీనివాస్ ఉన్నారు.
వజ్రోత్సవాల్లో రక్తదానంఉమ్మడి జిల్లాలో శిబిరాలు, జిల్లా స్థాయి ఆటలపోటీలు
వెలుగు, నెట్వర్క్:స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు బుధవారం రక్తదాన శిబిరాలు, ఆటల పోటీలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని బాల భవన్లో రక్తదాన శిబిరాన్ని మేయర్ నీతూకిరణ్, సీపీ నాగరాజు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. 750 మంది దాతల వరకు రక్తదానం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుదర్శనం, డాక్టర్ ఫరీదా బేగం, టీబీ నియంత్రణ విభాగం సమన్వ
యకర్త రవి, డీ ఎస్ ఓ చంద్రప్రకాష్, ఏసీపీలు వెంకటేశ్వర్, గిరిరాజ్ పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్ గ్రౌండ్లో జిల్లా స్థాయి ఖో ఖో, కబాడీ, వాలీబాల్ పోటీలు పెట్టారు. రాజీవ్ గాంధీ అడెటోరియంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యువ కళ ఉత్సవ్ 2022 నిర్వహిచారు. బోధన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి లయన్స్ కంటి ఆస్పత్రి వరకూ ర్యాలీ తీశారు. ఆస్పత్రిలో రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే షకిల్ అమేర్, ఏసీపీ రామరావులతో పాటుగా మరో 100మంది రక్తదానం చేశారు. బిచ్కుందలో ఇండియన్ రెడ్‌క్రాస్, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హస్పిటల్లో బ్లడ్‌డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ బ్లడ్ డొనేట్ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ముక్కర సంజీవరెడ్డి, డిస్టిక్ ప్రసిడెంట్ రాజన్న, డివిజన్ ప్రసిడెంట్ మర్గల వేణుగోపాల్, జిల్లా సెక్రెటరీ రఘుకుమార్, ట్రెసరర్ దస్తీరాం, డిస్టిక్ హెల్త్ కో అర్డినేటర్ డాక్టర్ విక్రం పాల్గొన్నారు.
పంటల వివరాల నమోదు త్వరగా పూర్తి చేయాలి
ఆర్మూర్, వెలుగు : పంటల వివరాల నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జేడీఏ తిరుమల ప్రసాద్ సూచించారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్, పిప్రి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. సర్వే నంబరు ఆధారంగా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఏఈవోలకు చెప్పారు. ఎవో హరికృష్ణ, ఎఈవో నరేశ్ కుమార్
పాల్గొన్నారు.
గజిబిజి ట్రాఫిక్.. అంబులెన్స్ కు దొరకని దారి
ఆర్మూర్ లో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేకపోవడంతో రోజు రోజుకూ ఈ సమస్య పెరుగుతోంది. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద 108 వెహికల్ బుధవారం మధ్యాహ్నం ట్రాఫిక్ లో ఇరుక్కుంది. స్థానికులే స్పందించి, ట్రాఫిక్ క్లియర్ చేసి 108 కు దారి ఇచ్చారు. వెహికల్స్ అన్నీ ఇష్టమున్నట్లు వెళ్లడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. - ఆర్మూర్, వెలుగు
కిడ్నీ సమస్యతో సీనియర్ రిపోర్టర్ మృతి
మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండలం కల్లడికి చెందిన సీనియర్ రిపోర్టర్ కొండ్ర గంగారాం(55) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. గంగారాం సుమారు 25 సంవత్సరాలు వివిధ పత్రికల్లో రిపోర్టర్‌గా పని చేశాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా మధ్యాహ్నం మృతి చెందాడు . ఆయన మృతి పట్ల మాక్లూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
బోధన్, వెలుగు: మండలంలోని సాలూర, సాలూర క్యాంప్ గ్రామాల వికలాంగ విద్యార్థులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎంపీపీ బుద్దె సావిత్రిరాజేశ్వర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీనేజ్‌లో ఉన్న బాలబాలికలకు, వికలాంగులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాలూర షకిల్, సీడీపీవో వినోద, సూపర్ వైజర్లు రాధిక, ప్రమీల, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నర్సయ్య పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్నిఅభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దే
వర్ని, వెలుగు: దేశంలో కాంగ్రెస్ హయాంలోనే వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందని, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌ది అని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో వర్ని మండలంలో బుధవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో హరిత విప్లవంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని, బ్యాంకుల జాతీయీకరణ వంటి సంస్కరణలు తెచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. దేశంలో నికార్సైన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అని, కానీ నరేంద్ర మోడీ రోజుకొక అబద్ధం మాట్లాడుతు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చార. ఈ పాదయాత్రలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ బాబా, చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ ,ఎంపీపీ లావణ్య రామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ దశ గౌడ్, ఎలమంచిలి శ్రీనివాస్, గంగా ప్రసాద్ ,గంగప్ప, మారుతి, శంకర్ ,హనుమంతరావు, శ్రీహరి పాల్గొన్నారు.
ఓటర్‌కార్డుకు , ఆధార్ లింక్ చేయాలె
భిక్కనూరు,వెలుగు : ఓటర్‌కార్డుకు ఆధార్‌కార్డును లింక్ చేయాలని సెక్రటరీలకు తహసీల్దార్ నర్సింలు సూచించారు. బుధవారం ఆయన మండలపరిషత్ కార్యాలయంలో సెక్రటరీలతో, కారోబార్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లీ, ఓటర్‌కార్డు ఉన్న వాళ్లను గుర్తించి, వాటిని ఆధార్‌కు లింగ్ చేయాలని చెప్పారు. సమావేశంలో ఎంపీఓ ప్రవీణ్‌కుమార్, సెక్రటరీలు దయానంద్, గుడిసె బాబు, పరేందర్రెడ్డి,శ్యాంమ్సుందర్,చంద్రశేఖర్
పాల్గొన్నారు.
బాల్కొండ సొసైటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం
బాల్కొండ వెలుగు: బాల్కొండ మండల వ్యవసాయ సొసైటీ చైర్మన్ ఏకగ్రీవంగా జరిగినట్లు ఎలక్షన్ ఆఫీసర్ సుహాసిని కులకర్ణి తెలిపారు. ఇదివరకు చైర్మన్ గా ఉన్న తూర్పు రమేశ్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, కిందటి మేలో ఆఫీసర్లు అతన్ని సస్పెండ్ చేశారు. దీంతో చైర్మన్ ఎలక్షన్ అనివార్యమైంది. బుధవారం సొసైటీ ఎలక్షన్ నిర్వహించగా12మంది డైరెక్టర్లు సొసైటీ చైర్మన్ గా వెన్నెల్ బి గ్రామానికి చెందిన సూరజ్ రెడ్డి ని ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.
కామారెడ్డిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా..ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లను ఆరు, నాలుగు లైన్ల రోడ్లుగా మార్చి, డివైడర్ల నిర్మాణంతో పాటు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. నిరుడు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని 99 గ్రామాలకు రూ.9.90 కోట్ల ఫండ్స్ శాంక్షన్ చేశారన్నారు. తాజాగా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి- కాచాపూర్ వద్ద లో లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2.15 కోట్లు, ఇసన్నపల్లి- పెద్దమల్లారెడ్డి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్ల ఫండ్స్ శాంక్షన్ అయ్యాయని తెలిపారు. త్వరలోనే పనులు షూరు చేస్తారన్నారు. కామారెడ్డి కి మెడికల్ కాలేజీ శాంక్షన్ అయిందని, భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో 2కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి అంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, టౌన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ జూకంటి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.