చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి వివేక్ వెంకటస్వామితోనే సాధ్యమవుతుందని ఆయన తనయుడు వంశీకృష్ణ అన్నారు. ఇసుక దందాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకునే సోయి ఆయనకు లేదని విమర్శించారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని రూరల్, టౌన్ వార్డుల్లో వివేక్ వెంకటస్వామికి మద్దతుగా వంశీకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 24వ వార్డు రామన్ కాలనీలో నిర్వహించిన ప్రచారంలో యువకులు పెద్ద సంఖ్యలో వంశీకృష్ణ వెంట నడిచారు.
వంశీకృష్ణ మాట్లాడుతూ.. అహంకారి, నియంతృత్వ పోకడలున్న బాల్క సుమన్‌ను గోదావరి నది అవతలి వైపు వెళ్లగొట్టేందుకు ప్రజలు ఈ నెల 30న తమ ఓటును ఆయుధంగా మార్చుకోవాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి వివేక్‌ను గెలిపించాలని కోరారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పింఛన్ల వంటి ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు.
ప్రచారంలో పార్టీ నాయకులు కడారి వీరస్వామి, సోతుకు రాజయ్య, అలివెల్లి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రాజు గౌడ్, సోతుకు ఉదయ్, వెల్ది సాయి కృష్ణ, శ్రీరామోజు సాయి, కళ్యాడపు రాకేశ్, కళ్యాడపు కల్యాణ్, బెల్లి నరసింహ, రావుల శ్రీనివాస్, నోముల పోచ గౌడ్, ఆకుదారి శ్రీనివాస్, సొప్పరి రాజ్ కుమార్, సుంకరి ప్రకాశ్ రావు, లక్ష్మీ దాస్, సన్నీ, పోచంపల్లి లక్ష్మి, చంద్రకళ, ఓదెమ్మ, మణెమ్మ, లక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.