డోర్నకల్‌‌‌‌ అభివృద్ధికి రూ. 115 కోట్లు

డోర్నకల్‌‌‌‌ అభివృద్ధికి రూ. 115 కోట్లు

మరిపెడ, వెలుగు : డోర్నకల్‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 115 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ చెప్పారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడలోని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌ హౌజ్‌‌‌‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. రూ. 36 కోట్లతో మరిపెడ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌ను 100 పడకల హాస్పిటల్‌‌‌‌గా మార్చనున్నట్లు చెప్పారు. అలాగే లింక్‌‌‌‌ రోడ్లకు రూ. 37.25 కోట్లు, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ రోడ్లకు రూ. 14 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

 ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌కు థాంక్స్‌‌‌‌ చెప్పారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్‌‌‌‌ నవీన్‌‌‌‌రావు, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ సింధూర, నాయకులు అచ్యుతరావు, సుదర్శన్‌‌‌‌రెడ్డి, రాంబాబు, రవీందర్, వెంకన్న పాల్గొన్నారు.