
పటాన్చెరు,వెలుగు: అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్‌లో పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు.
అనంతరం పటాన్చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో బీరప్ప , అక్క మహంకాళి విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొని పూజలు చేశారు. అలాగే ఇటీవల జరిగిన 67వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అండర్ 14 బ్యాడ్మింటన్ విభాగంలో బంగారు పతకం సాధించిన పటాన్చెరు పట్టణానికి చెందిన హర్ష, నర్రా శబరీశ్‌ను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు గాలి అనిల్ కుమార్, శంకర్ యాదవ్, సపాన దేవ్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పాల్గొన్నారు.