- ఏడాదిలోపే వందల కోట్ల ఫండ్స్తీసుకొచ్చిన ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- సీనియర్ కాంగ్రెస్ లీడర్ బండి సదానందం
కోల్బెల్ట్, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కాకా వెంకటస్వామి కుటుంబం 60 ఏండ్లుగా కృషి చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ లీడర్, అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్బండి సదానందం యాదవ్అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలిచిన కొంత కాలానికే వందల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. మంగళవారం మందమర్రిలోని ఇందూ గార్గెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.500 కోట్ల అభివృద్ధి పనులు నడుస్తున్నా యని తెలిపారు. తాత, తండ్రి చూపిన మార్గంలోనే ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. భీమారం మండలం జోడువాగుల వద్ద కొత్త రోడ్డు, విస్తరణకు రూ.100 కోట్లు ఫండ్స్ సాంక్షన్ చేయించారని.. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో డ్రింకింగ్వాటర్ సప్లై కోసం అమృత్ స్కీం ద్వారా రూ.100 కోట్ల ఫండ్స్ సాంక్షన్ చేయించిన ఘనత ఎంపీ వంశీకృష్ణకే దక్కిందన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణను ప్రజలు ఆదరిస్తున్న తీరు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు బత్తుల నరేశ్, జగదీశ్, కోట రాజయ్య, చిర్ర రాకేశ్, చిప్ప సత్యనారాయణ, బొలిశెట్టి వేణు, సెల్పురి మల్లయ్య, సిరికొండ శంకరయ్య, మారం శంకర్, ప్రణయ్, కీర్తి తిరుపతి, సత్యనారాయణ, సీహెచ్.వీరాచారి, రాజన్న, కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.