సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నిమ్మికల, చివ్వెంల మండలాల్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిందన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్ని ఉద్యమాలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అనంతరం కందగట్ల మంగలి తండాకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. సమావేశంలో తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, కొప్పల వేనారెడ్డి, పోతు భాస్కర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మండల అధ్యక్షుడు కందాల వెంకటరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.