గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

ఏటూరునాగారం, వెలుగు : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సెక్రటరీలు పనిచేయాలని అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ పి. శ్రీజ ఆదేశించారు. పల్లె ప్రగతిపై మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీలు, సెగిగ్రేషన్‌‌‌‌ షెడ్లు, శానిటేషన్‌‌‌‌పై పలు సూచనలు చేశారు.

సమావేశంలో డీపీవో వెంకయ్య, డివిజనల్‌‌‌‌ పంచాయతీ అధికారి స్వరూప, ఎంపీడీవో బూస కుమార్ పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్‌‌‌‌ సెంటర్‌‌‌‌, జడ్పీ హైస్కూల్‌‌‌‌ను అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ తనిఖీ చేశారు. హాస్పిటల్‌‌‌‌లో వార్డులు, లేబర్ రూమ్‌‌‌‌ను పరిశీలించి సౌలత్‌‌‌‌లను తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

జడ్పీ హైస్కూల్‌‌‌‌లో టీచర్లు, సిబ్బంది అటెండెన్స్‌‌‌‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌‌‌‌ అనిల్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎం సాంబశివరావు, హెడ్‌‌‌‌ సిస్టర్‌‌‌‌ నాగదేవి ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌ భాస్కర్‌‌‌‌ పాల్గొన్నారు.