హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ అభివృద్ధి :  సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ అభివృద్ధి :  సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా  హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.  ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.  

భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు.  నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్  రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్ టైల్  పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు  సీఎం. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని,  నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతీ 20రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.  నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని  సీఎం స్పష్టం చేశారు. వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని..  ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.