మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి రేవంత్‌రెడ్డి నివాళి
చౌటుప్పల్ వెలుగు: కాంగ్రెస్వల్లనే దేశ అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పోర్లగడ్డ తండాలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అనంతరం తండాలోని గిరిజనులకు పండ్లు పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’ను ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్టుల వల్లే మునుగోడు ప్రాంతంలో అభివృద్ధి జరిగిందన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జెండా కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగరవేశారు.
వెలుగు, నెట్వర్క్: రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో శనివారం రాజీవ్ గాంధీ ఫొటోలకు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం పాల్గొన్నారు. దేవరకొండ, తుంగతుర్తిలోని తెలంగాణ చౌరస్తాలో, హుజూర్ నగర్ రాజీవ్సెంటర్లో రాజీవ్విగ్రహం, ఫొటోల వద్ద కాంగ్రెస్లీడర్లు నివాళులర్పించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలోని రంగా థియేటర్ చౌరస్తాలో రాజీవ్విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ టౌన్హైదరాబాద్ రోడ్డులోని రాజీవ్విగ్రహం వద్ద కాంగ్రెస్లీడర్లు నివాళులర్పించారు.
టీచర్ల సమస్యలు పరిష్కరించని సర్కారు
కోదాడ, వెలుగు: టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఎస్టీయూ వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన జిల్లా సదస్సులో ఆయన చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్లలో ఖాళీగా వున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘మన ఊరు– మన బడి’కు రూ.వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి చివరకు వేల రూపాయలు కేటాయించడంతో ఆ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ ఖాసీం, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్, ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిళ్లుట్ల రఘు, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నాగేశ్వర రావు పాల్గొన్నారు.
అరెస్టైన భూ నిర్వాసితులకు తల్లోజు పరామర్శ
చండూరు, మర్రిగూడ, వెలుగు: సీఎం మీటింగ్‌కు ఆటంకం కలిగిస్తారన్న అనుమానంతో చర్లగూడెం, లక్ష్మణపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్మీటింగ్ ముగిసిన తర్వాత నిర్వాసితులను పోలీసులు రాత్రి 8 గంటలకు దేవరకొండ పోలీస్ స్టేషన్ నుంచి వదిలేశారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మర్రిగూడలో భూనిర్వాసితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇండ్లను కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా వారికి ఇవ్వవలసిన పరిహారం చెల్లించకుండా దీక్షలు చేస్తున్న వారిని అరెస్ట్చేయడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ప్రాజెక్టు శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే సీఎం మునుగోడు గడ్డపైకి వచ్చారని ఎద్దేవా చేశారు. అక్రమ అరెస్టులతో రైతులను భయపెట్టలేరని, వీరికి న్యాయం జరిగేంతవరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
దళిత, గిరిజన లీడర్ల ముందస్తు అరెస్టు
యాదాద్రి, చౌటుప్పల్, వెలుగు: సీఎం కేసీఆర్మునుగోడు పర్యటన సందర్భంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో దళిత, గిరిజనులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సంస్థాన్ నారాయపురం మండలంలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంతోపాటు గిరిజన బంధు ప్రకటించాలని, లేకపోతే సీఎం పాల్గొనే
‘మునుగోడు ప్రజాదీవెన సభ’ను అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించారు. పలు అంశాలపై టీఆర్ఎస్ను ఎమ్మార్పీ
ఎస్ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎమ్మార్పీఎస్, గిరిజన లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ సాధనకు ఉద్యమిస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన గిరిజన, దళితల సంఘాల లీడర్లు బోయ దేవేందర్, తూర్పుంటి రవి, బోయ లింగస్వామి, ఊదర నరసింహ, పల్లె శివకుమార్, నేనావత్ జలంధర్, కొర్ర దేవా, మెగావత్ గణేశ్‌ను చౌటుప్పల్, సంస్థాన్నారాయపురం పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మునుగోడులో...
మునుగోడు వెలుగు: మునుగోడులో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు, 100 పడకల హాస్పిటల్ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేస్తూ మండల కేంద్రంలో శనివారం నిరసన తెలిపిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
జిల్లా ఏర్పాటు ఉద్యమానికి లాయర్ల సంఘీభావం
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడను జిల్లాగా మార్చాలని చేస్తున్న ఉద్యమానికి శనివారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ లాయర్లు సంఘీభావం తెలిపారు. జిల్లా సాధనలో భాగంగా సాధన సమితి సభ్యులు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో లాయర్లు ముందుండి పోరాటం చేస్తారన్నారు. కొత్త జిల్లాల పునర్విభజన సమయంలోనే మిర్యాలగూడకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాగా చేయాలని కోరారు. కార్యక్రమంలో లాయర్లు భవాని, సత్యనారాయణ, పరమేశ్, శ్రీనివాస్, సతీశ్, జిల్లా సాధన సమితి కన్వీనర్ కో కన్వీనర్, డా.జాడి రాజు, దశరథ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రవి, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెన్షన్ కోసం వెళ్తే చనిపోయావని చెప్పిన్రు
మేళ్లచెరువు, వెలుగు: పెన్షన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి నువ్వు చనిపోయావని ఆఫీసర్లు చెప్పడంతో అతడు ఒక్కసారిగా షాక్అయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన షేక్ నాగుల్ మీరా(కత్తి) దివ్యాంగుల కోటాలో పెన్షన్ కోసం 2020 నవంబర్ లో అప్లై చేసుకున్నాడు. తాజాగా పెన్షన్ లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో నాగుల్‌మీరా ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లి వాకబు చేశాడు. ఆసరా పోర్టల్ లో నువ్వు చనిపోయినట్లు ఉందని ఆఫీసర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. ఎదురుగా మనిషి ఉంటే చనిపోవడమేంటంటూ ఆఫీసర్‌ను ప్రశ్నించాడు. లారీ ఆఫీస్ లో గుమస్తాగా పనిచేసే తనకు యాక్సిడెంట్లో కాలు విరిగిందని, తనకు పెన్షన్ఇచ్చి ఆదుకోవాలని ఆఫీసర్లను కోరాడు.
భారీగా తరలివచ్చిన జనం..
సీఎం కేసీఆర్ సభకు మునుగోడుతోపాటు, నల్గొండ, దేవరకొండ, నకిరేకల్నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పార్టీ ఇన్చార్జిలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేయడమేగాక, తమ సొంత నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించారు. సభకు హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగడి సునీత, భాస్కర్ రావు ,సైదిరెడ్డి , చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, నెల్లికంటి సత్యం, మదర్‌డెయిరీ చైర్మన్గంగుల కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు నారబోయిన స్వరూప రాణి, కర్నాటి వెంకటేశం, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.