గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ యువజన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గుండ్లపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తోడుగా ఎంపీగా వెలిచాల రాజేందర్ ను గెలిపించినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయన వెంట నాయకులు ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, రాజేందర్రెడ్డి, మల్లేశం, నరసింహ రెడ్డి ఉన్నారు.