
తెలంగాణ తెలుగుదేశం పార్టీ(TTDP)కి షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళుతున్నారు. తాజాగా ఇవాళ (సోమవారం) ఆ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు .. మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ పార్టీ సభ్యత్వం, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కు రాజీనామా లేఖ పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
మరోవైపు అక్టోబర్ 3న ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.