వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భగంగా తొలిరోజు(అక్టోబర్ 15) అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అగ్ని ప్రతిష్ట, భేరి పూజ, కలశ స్థాపన చేశారు వేద పండితులు. వీకెండ్ సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 24వ తేదీ వరకు జరుగనున్నాయి.
అమ్మవారి రూపాలు
2023 అక్టోబర్ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీబాల త్రిపుర సందరీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. 16న గాయత్రీదేవి, 17న అన్నపూర్ణాదేవి, 18న మహాలహక్ష్మీదేవి, 19న లలితా త్రిపురసుందరీదేవి, 20న సరస్వతీదేవి, 21న దుర్గాదేవి, 22న మహిషాసురమర్దిని, 23న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.