డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)..స్టార్ ధనుష్ (Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ D51గా పట్టాలెక్కనున్న ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్తో ఆడియన్స్లో మంచి హైప్ క్రియేట్ చేశారు. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు..ఎంతో ఖరీదైన భారీ బిల్డింగులు..మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడలు..ఈ రెండింటికి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని' చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల టెక్నికల్ టీం వేటలో ఉన్నారు. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ను ఎంచుకునే ప్రాసెస్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాల్లో సంగీతమే ప్రధాన బలం అన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల సినిమాలోని సాంగ్స్ అన్ని ఎవర్ గ్రీన్‌లా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
D51 ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు..మ్యూజిక్ సెన్సేషన్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, రెహమాన్ కండీషన్లు, పని తీరుని చూసి భయపడి వద్దని.. శేఖర్ కమ్ముల వెనుకడుగు వేసినట్టుగా సమాచారం. ఇండియా లెవెల్లో సాంగ్స్ కంపోజ్ చేసే రెహమాన్తో నచ్చినట్లు సాంగ్స్ చేపించుకోవడం కుదరని పని అని అర్ధమైనట్లు టాక్.
ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ దగ్గర మన డైరెక్టర్స్ ఆటలు చెల్లవు. ఆయన ఏం కంపోజ్ చేసి ఇస్తే, అదే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మన తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా రెహమాన్‌ను కాంటాక్ట్ అవ్వరు. దీంతో శేఖర్ కమ్ముల దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad)ను సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారట. ఫస్ట్ టైం దేవి తో వర్క్ చేయడం వల్ల నచ్చినట్టుగా సాంగ్స్ రాబట్టుకోవాలని శేఖర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ALSO READ : ఆర్జీవీ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆఫర్ కూడా ఇచ్చేశాడు
పుష్ప 2 సాంగ్స్తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దేవి శ్రీ ప్రసాద్. ముందుగా థమన్ ను తీసుకోవాలని ఆలోచించిన..ఇన్ టైంలో సాంగ్స్ కంపోజ్ చేయడనే టాక్ ఉండటంతో..దేవి ని తీసుకోవడానికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడట. త్వరలో D51 నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ధనుష్ 51వ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో ధనుష్‌ను మునుపెన్నడూ చూడని గెటప్ లో చూడబోతున్నట్టు సమాచారం.