రహస్యంగా జీవో.. KCRకు బందరు పోర్ట్: దేవినేని ఉమ

రహస్యంగా జీవో.. KCRకు బందరు పోర్ట్: దేవినేని ఉమ

జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ.  సీఎం జగన్.. సత్య పాలన అంటూ నీతులు వల్లించడానికి మాత్రమే సరిపోతున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్…  చేసిన సహాయానికి బందర్ పోర్ట్ ను జగన్ కట్టబెట్టారని అన్నారు. ఇందుకు రహస్యంగా జీవో ఇచ్చారని చెప్పారు. గతంలో వైఎస్ కూడా ఒకసారి బందరు పోర్ట్ ను తరలించడానికి చూశారని అయితే ప్రజా ఉద్యమంతో వైఎస్ వెనక్కి తగ్గారని తెలిపారు.

ఏపీ అసెంబ్లీని జగన్ ఐదేండ్లలో కడతామని అన్నారని ఉమ గుర్తుచేశారు.. అయితే కేసీఆర్ కడతారా లేక ఏపీ ప్రభుత్వం కడతుందా అనేది ప్రకటించాలని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు కనీసం ఇసుక కూడా దొరుకకుండా చేస్తున్నారని.. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయని అన్నారు ఉమ. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ నగదు ఇంతవరకు గ్రామాలకు చేరలేదని చెప్పారు.

విజయ సాయి రెడ్డి ని ఇంటర్ పోల్ నిందితులు అని అన్నారు దేవినేని ఉమ. కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారని… పునాదులు లేపకపోతే.. స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని అన్నారు. చేసిన అసత్య ప్రచారాలకు ఇప్పుడైనా చెంపలు వేసుకోండని అన్నారు.

22మంది ఎంపిలు మోడిని కలిసి ఏమి అడుక్కున్నారో ట్వీట్ చేయి అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు ఉమ. నీలాగా నేను అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. చంద్రబాబు పడిన కష్టానికి నిదర్శనం  పోలవరం ప్రాజెక్టు అని… రెండు నెలల నుంచి పనులు నిలిపేసిన పాపం జగన్ దేనని అన్నారు. రాష్ట్ర ప్రజలను, వారి కష్టాలను జగన్ పట్టించుకోకపోతే వారే బుద్దిచెబుతారని అన్నారు.