బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్‌‌‌‌!

బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్‌‌‌‌!

ముంబై : బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లకు దేవజిత్‌‌‌‌ సైకియా, ప్రభతేజ్ భాటియా శనివారం నామినేషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ రెండు పదవులకు ఈ ఇద్దరు మినహా మరెవరు పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్స్‌‌‌‌ గడువు కూడా సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

గతంలో ట్రెజరర్‌‌‌‌గా పని చేసిన ఆశీష్‌‌‌‌ శీలర్‌‌‌‌.. మహారాష్ట్ర గవర్నమెంట్‌‌‌‌లో క్యాబినెట్‌‌‌‌మినిస్టర్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టారు. జై షా ఐసీసీ చైర్మన్‌‌‌‌గా వెళ్లిపోవడంతో దేవజిత్‌‌‌‌ను తాత్కాలిక సెక్రటరీగా బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ రోజర్‌‌‌‌ బిన్నీ నియమించారు. ఇప్పుడు ఆ పదవుల కోసం వీరిద్దరు అఫీషియల్‌‌‌‌గా పోటీపడుతున్నారు.