
ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ ప్లేయింగ్ 11 లో మాత్రం ఆశ్చర్యకరంగా ఓపెనర్ డెవాన్ కాన్వే లేకపోవడం షాక్ కు గురి చేస్తుంది. కాన్వే న్యూజిలాండ్ తరపున నిలకడగా రాణించే బ్యాటర్లలో ఒకడు. వన్డేల్లో 45 యావరేజ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయం కూడా కాలేదు. కాన్వే తుది జట్టులో లేకపోవడం వెనుక కారణం తెలియాల్సి ఉంది.
యంగ్ అద్భుత ఫామ్ కారణంగానే:
న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కివీస్ తరపున అత్యత్తంగా రాణిస్తున్నాడు. రచీన్ రవీంద్ర ఆల్ రౌండర్ గా ఉపయోగపడతాడు. దాంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే సెంచరీ చేసి సీవోపీఆర్ ఫామ్ లో ఉన్న అతను పవర్ ప్లే లో ధాటిగా ఆడగలడు. మిడిల్ ఆర్డర్ లో ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. విలియంసన్, మిచెల్, లాతమ్, ఫిలిప్స్ ఇలా ఎవరికి వారే మ్యాచ్ విన్నర్లు. దీంతో కాన్వేకు తుది జట్టులో స్థానం దక్కలేదు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో పర్వాలేదనిపించిన కాన్వే భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించలేకపోయాడు. సెమీ ఫైనల్ కు ఛాన్స్ వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది.
నిలకడగా న్యూజిలాండ్:
ఇక ఈ మ్యాచ్ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో విలియంసన్ (11) రచీన్ రవీంద్ర (34) క్రీజ్ లో ఉన్నారు. 21 పరుగులు చేసి విల్ యంగ్ ఔటయ్యాడు. ఈ వికెట్ ఎంగిడికి దక్కింది.