తిరుమల కొండ ఎక్కుతూ.. తెలంగాణ వ్యక్తి మృతి

తిరుమల కొండ ఎక్కుతూ.. తెలంగాణ వ్యక్తి మృతి

మొక్కు తీర్చుకోవటానికి తిరుమల కొండకు వెళ్లిన భక్తుడు.. మెట్ల మార్గంలో కొండ ఎక్కుతూ గుండెపోటుతో చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2025, ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం.. తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వెంకటేశ్ అనే వ్యక్తి తిరుపతి వెళ్లాడు.

తిరుపతి నుంచి శ్రీవారి మెట్లు మార్గం నుంచి తిరుమల కొండ ఎక్కుతున్నాడు. 200 మెట్లు ఎక్కిన తర్వాత వెంకటేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన తోటి భక్తులు.. తిరుమల అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరించారు. అప్పటికే భక్తుడు వెంకటేశ్ చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు.

మెట్ల మార్గంలో అత్యవసర చికిత్స కోసం కొన్ని క్లీనిక్స్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మధ్య వాటి నిర్వహణ సరిగా లేదనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. కొండకు మెట్లు ఎక్కే సమయంలో ఏ భక్తుడికి అయినా అత్యవసర చికిత్స అవసరం అయితే.. మెట్ల మార్గంలోని ఆయా క్లీనిక్స్ లో ఉండే వైద్య సిబ్బంది వెంటనే చికిత్స అందిస్తారు. ఇటీవల ఆయా క్లినిక్స్ సరిగా పని చేయటం లేదనేది భక్తుల ఆరోపణలు.