బాసర సరస్వతి ఆలయానికి రూ.53.36 లక్షల ఆదాయం

బాసర సరస్వతి ఆలయానికి రూ.53.36 లక్షల ఆదాయం
  • 73 గ్రాముల బంగారం, 2.1 కిలోల వెండి

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఉదయం ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో లెక్కించారు. ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, పోలీసుల సమక్షంలో ఆలయ సిబ్బంది లెక్కింపు చేపట్టగా నగదు రూ.53,36,176 నగదుతోపాటు మిశ్రమ బంగారం 73 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ 21 నోట్ల వచ్చినట్లు ఈవో తెలిపారు. 

ఈ ఆదాయం  43 రోజుల్లో సమకూరినట్లు చెప్పారు. లెక్కింపులో వ్యవస్థాపక ధర్మ కర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ గౌడ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.