
మేడారం (ఏటూరునాగారం), వెలుగు : బుధవారం సారలమ్మ రాక సందర్భంగా తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాకి చెందిన మల్లయ్యగిరి రాజుకు క్యూ లైన్ లో గుండెనొప్పి వచ్చింది. దీంతో రెస్క్యూ టీం ముందుగా కృత్రిమ శ్వాస అందించి గద్దెల సమీపంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.