కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయానికి ఓ భక్తుడు 300 కిలోమీటర్ల పాదయాత్రతో చేరుకొని, మొక్కు చెల్లించాడు. భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మత్స వీర్రాజు తన గ్రామంలోని పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 30 సంవత్సరాల నుంచి అదే ఆలయంలో వీర్రాజు హనుమాన్ దీక్ష తీసుకొని స్వామివారికి సేవ చేస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం నూతన ఆలయానికి శ్రీకారం చుట్టిన వీర్రాజు దాతల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించాడు. ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి దయతోనే ఆలయ నిర్మాణం పూర్తయిందని ఈనెల ఆరున చర్ల మండల కేంద్రం నుంచి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరారు. శనివారం గుట్టకు చేరుకున్న వీర్రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.