300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి..  కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు.

భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మత్స వీర్రాజు ఆంజనేయ స్వామి భక్తుడు. గ్రామంలోని పురాతన శ్రీ సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 30 సంవత్సరాల నుండి అదే ఆలయంలో వీర్రాజు హనుమాన్ దీక్ష తీసుకొని స్వామివారికి సేవ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నూతన ఆలయానికి శ్రీకారం చుట్టిన వీర్రాజు దాతల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించాడు.

తాను చేపట్టిన కార్యం పూర్తి కావడంతో కొండగట్టు ఆంజనేయస్వామి దయతోనే ఆలయ నిర్మాణం పూర్తయిందని మే 6న చర్ల మండల కేంద్రం నుంచి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరారు. శనివారం గుట్టకు చేరుకున్న వీర్రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు.