వెండి నాణేల భాగ్యం..చార్మినార్​కు పోటెత్తిన భక్త జనం

వెండి నాణేల భాగ్యం..చార్మినార్​కు పోటెత్తిన భక్త జనం

చార్మినార్ ​శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురు, శుక్రవారాల్లో వేలాదిగా తరలివచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక వెండి నాణేలను పంపిణీ చేస్తున్నారు. నాణెంపై ఓ వైపు భాగ్యలక్ష్మి అమ్మవారు, మరో వైపు చార్మినార్​ను ముద్రించారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండితో ఈ నాణేలు చేయించి భక్తులకు పంచడం ఆనవాయితీగా వస్తున్నదని ఆలయ ట్రస్ట్ చైర్​పర్సన్​ ​శశికళ తెలిపారు.

నాణేల కోసం శుక్రవారం గుల్జార్​హౌజ్ ​వరకు భక్తులు బారులు తీరారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం కూడా వెండి నాణేలను పంపిణీ చేయనున్నారు. వెలుగు, చార్మినార్