టూమచ్ భక్తి : గుడిలోని ఏసీ నీళ్లను అమృతంగా తాగుతున్న భక్తులు

టూమచ్ భక్తి : గుడిలోని ఏసీ నీళ్లను అమృతంగా తాగుతున్న భక్తులు

జనాలు బొత్తిగా ఆలోచించడమే మర్చిపోతున్నారు. గుడ్డి ముందున్న వారిని ఫాలో అవుతూ.. గొర్రెల్లా మారిపోతున్నారు. మథురలోని బాంకే బిహారీ గుడిలో భగవంతుని పాదాల నుంచి వచ్చిన నీరు అనుకొని ఏసీ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ తాగుతున్నారు. గుడిగోపురం నుంచి ఎయిర్ కండీషనర్ రిలీస్ చేసే వాటర్ కారుతున్నాయి. అయితే గుడికి వచ్చిన భక్తులు అవి విగ్రహాన్ని అభిషేకించిన నీళ్లు అనుకొని క్యూ కట్టి మరీ తాగుతున్నారు. ఈ నీళ్లు కొందరైతే గ్లాసుల్లో పట్టుకొని మరీ తాగుతున్నారు. ఇంకొందరు వాటిని నెత్తిన చల్లుకుంటున్నారు. 

ఎవరో ఒక్కరు ఫస్ట్ తెలియక తాగితే.. అక్కడున్న వారంతా అదే ఫాలో అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడ్ అవుతుంది.ఎక్స్ లో 3.8 మిలియన్ వ్య్వూస్ తో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అందరికీ 100 శాతం వెల్ ఎడ్యుకేషన్ కావాలని.. దేవుని పాదాల నుంచి వచ్చిన నీళ్లు అనుకొని ఏసీ వాటర్ తాగుతున్నారని క్యాప్షన్ రాసి ఎక్స్ లో షేర్ చేశారు.

ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చిన నీళ్లు ఫంగస్, ఇన్‌ఫెక్షన్‌ కారణమైయ్యే క్రీములను కలిగి ఉంటాయని ఆ వీడియో చూసిన ఓ డాక్టర్ కామెంట్ చేశారు. ఏసీ నుంచి  నీటిని తాగితే లెజియోనెల్లా అనే బ్యాక్టీరియా భయంకరమైన లెజియోనైర్స్ వ్యాధికి కారణమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏం జరుగుతుంది? ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒక్కరు కూడా ఆలోచిండం లేదు.. ఇంత నెగ్లిజన్స్ ఎందుకు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 
ఏసీ నీళ్లు చరణామృతంలా తాగుతున్నారా?.. నమ్మబుద్ది కావడంలేదు. ఇప్పటికీ భారతదేశంలో మూఢనమ్మకాలు, అజ్ఞానం ఈ స్థాయిలో ఉన్నాయా? అని మరో ఎక్స్ యూజర్ రాసుకొచ్చాడు. ఇంకో వ్యక్తి ఆలయ ట్రస్ట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ అంత జరుగుతన్న దేవాలయ సిబ్బంది ఎవరికీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించాడు. ఇలా రకరకాలుగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.