భద్రకాళీ అమ్మవారి సేవలో భక్తులు

భద్రకాళీ అమ్మవారి సేవలో భక్తులు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు భక్తులు ఆదివారం భారీగా హాజరయ్యారు. నాలుగోరోజు ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. వరంగల్​భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, భక్తులు పాల్గొన్నారు. కాజీపేట శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎంపీ కడియం కావ్య దర్శించుకున్నారు.

 ఆమెవెంట 62వ డివిజన్​కార్పొరేటర్​జక్కుల రవీందర్​యాదవ్, రైల్వే మజ్దూర్​యూనియన్​నాయకులు పాక వేద ప్రకాశ్, శ్రీనివాస్​యాదవ్, రాజేశ్​తదితరులున్నారు.​ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి, కొండూరు, తిర్మలాయపల్లి, గన్నారం, సన్నూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గమాత విగ్రహాల నిర్వాహకులకు ఫౌండేషన్ అధినేత పరిపాటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశాల మేరకు సంస్థ ప్రతినిధులు ఆర్థిక సాయం అందజేశారు. 

అనంతరం అన్నప్రసాద కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ములుగు రామాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారు లలిత త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పైడిమల్ల శుభరాణి అనిల్ కుమార్ గౌడ్ దంపతులు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బండారి మోహన్ కుమార్, అధ్యక్షుడు  చింతలపూడి భాస్కర్ రెడ్డి, సభ్యులు భక్తులు పాల్గొన్నారు. - కాశీబుగ్గ/ కాజీపేట/ రాయపర్తి/ ములుగు, వెలుగు