ములుగు, వెలుగు : మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని ఎఫ్‌డీవో జోగేందర్ సూచించారు. ములుగు మండలం ఇంచర్ల పంచాయతీ పరిధిలోని ఎర్రి గట్టమ్మ వద్ద శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. అనంతరం ఎఫ్‌డీవో మాట్లాడుతూ అడవులను సైతం మన ఇండ్లలాగే క్లీన్‌గా ఉంచుకోవాలని చెప్పారు. పరిశుభ్రత పాటిస్తూ అడవులను సంరక్షించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ శంకర్ ఉన్నారు.