గంగమ్మ చెంతకు గణనాథులు

గంగమ్మ చెంతకు గణనాథులు

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా భక్తులు గణేశ్​ నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. పదకొండు రోజులు పూజలందుకున్న గణపయ్య గురువారం గంగమ్మ చెంతకు చేరాడు. డప్పుచప్పుళ్లు, డీజే పాటల మధ్య వినాయకుడి శోభా యాత్రలు జోరుగా సాగాయి. 

చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి పట్టణాలలో సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జనం కార్యక్రమాల్లో పలు రాజకీయ పార్టీల నేతలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.  

_వెలుగు న్యూస్ నెట్​వర్క్