శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రూ.12లక్షల విరాళం

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రూ.12లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు : ఈ ఏడాది జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణ కోసం నెల్లూరుకు చెందిన భక్తులు సంతోష్, సాహిత్య దంపతులు బుధవారం రూ.12లక్షలను విరాళంగా ఈవో రమాదేవికి అందజేశారు. భద్రాచలం తాతగుడి సెంటర్​కు చెందిన ఎం.సుశీల సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం ఇచ్చారు. అంతకుముందు ఉదయం ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. బేడా మండపంలో నిత్య కల్యాణం జరగ్గా భక్తులు కంకణాలు ధరించి పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.