గుడిలో తోపులాట..కాలువలో పడ్డ భక్తులు

నిర్మల్ జిల్లా శివరాత్రి ఉత్సవాల్లో పెను ప్రమాదం తప్పింది. దిలావర్ పూర్ మండలం కదిలి పాపహరేశ్వర ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శివుడి దర్శనం కోసం గంటల తరబడి జనం భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆలయ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. దీంతో ముగ్గురు భక్తులు పక్కనే ఉన్న వాగులో పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ కు తరలించడం కష్టంగా మారింది.