వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు :  సంకాంత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే  పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.