![జములమ్మకు పోటెత్తిన భక్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/devotees-flock-to-jamulamma_h532xkynpb.jpg)
గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. కర్నాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
మేకపోతులు, కోళ్లు బలి ఇచ్చి, దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భారీగా వాహనాలు రావడంతో అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.