జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అన్నదాన సత్రంలో శివస్వాములకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఈవో సురేందర్ కుమార్  తెలిపారు. శివరాత్రి వరకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.