
కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరమీసాల స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానమాచరించి దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో స్వామి వారి దర్శనానికి గంటల సమయం పట్టింది.
అనంతరం మహిళలు మట్టి కుండల్లో నైవేద్యం వండి డప్పుచప్పుళ్ల మధ్య బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్లక్ష్మారెడ్డి ఏర్పాట్లు చేశారు. సీఐ శ్రీను, ఎస్ఐ నాగరాజు బందోబస్తు నిర్వహించారు. కొమురవెల్లి, వెలుగు: