ఆదిలాబాద్, వెలుగు: జైనథ్ మండలంలోని పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారానికి తోడు సంక్రాంతి సెలవులు రావడంతో జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తాకిడి పెరిగింది. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు ఆలయంలో బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.