ఆసిఫాబాద్ , వెలుగు : రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని తొమ్మిదవ రోజు శుక్రవారం మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మహారాష్ట్ర తో పాటు జిల్లా నుంచి వందలాది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.
ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్, అర్చకులు పూసాల మహేశ్ శాస్త్రి ఆధ్వర్యంలో మహ చండీయాగం నిర్వహించారు.