శ్రీ చిత్తారమ్మ దేవి  చెంతకు పోటెత్తిన భక్త జనం

శ్రీ చిత్తారమ్మ దేవి  చెంతకు పోటెత్తిన భక్త జనం

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజులరామారంలో కొలువైన శ్రీ చిత్తారమ్మ దేవి 50వ జాతర ఆదివారం వైభవంగా జరిగింది.  ఉదయం అభిషేకం, విజయ దర్శనం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం గాజులరామారం నుంచి ఆలయం వరకూ అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల ఆటలు ఆకట్టుకున్నాయి. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం రంగం, మంగళవారం కుంకుమార్చన నిర్వహించనున్నారు.