వేములవాడ రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవురోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు రాజన్న సన్నిధికి తరలివచ్చారు. ఉదయమే ధర్మగుండంలో స్నానమాచరించి తడిబట్టలతోనే ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనంతరం రాజన్నను ఎంతో ఇష్టమైన కోడె మొక్కు చెల్లించారు. భక్తుల రద్దీతో కల్యాణకట్ట, ప్రసాదం కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి.

బ్రేక్​ దర్శనాన్ని భక్తులు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఆదివారం తన పెళ్లి రోజు సందర్భంగా విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ కుటుంబసమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామి వారి తీర్థ ప్రసాదం  అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్​ దంపతులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.