శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు  భారీగా తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తులు రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు తెల్లవారుజాము నుంచే భక్తులను దర్వనానికి అనుమతించారు. భక్తులంతా పాతాళ గంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు.

స్వామివారి ఉత్సవాళ్లో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు స్వామి, అమ్మవార్ల  ప్రభోత్సవం జరుపబడుతుంది. రాత్రి 7 గంటలకు నంది వాహనసేవ, రాత్రి 10 గంటల నుంచి మల్లికార్జునికి రుద్రాభిషేకం, పాగలంకరణ కార్యక్రామాలు చేస్తారు. శ్రీశైలం మల్లన్న క్షేత్ర విమాన గోపుర శిఖరానికి నవనందులకు పాగాలంకరణ జరిపిన తర్వాత రాత్రి 12 గంటలకు కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తారు.