శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్

వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు.  శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీతా పెరిగింది. శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారు జాము నుంచి  పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శించుకుంటున్నారు. దర్శనానికి భారీగా  భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఇసుకేస్తే రాలనంత భక్త జనం తరలివచ్చింది. దీంతో భ్రమరాంబ మల్లన్న స్వామి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

భారీగా ట్రాఫిక్ జామ్..

భక్తులు పోటెత్తడంతో  శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం నుంచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచాయి.  ముఖద్వారం నుంచి శ్రీశైలం టోల్ గేట్ వరకు భారీగా  వాహనాలు నిలిచిపోయాయి. వరుససెలువులతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  దీనితో వేల సంఖ్యలో భక్తులు వాహనాల్లో శ్రీశైల క్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో  ఆలయ ముఖద్వారం, హటకేశ్వరం, గణపతి ఆలయం వద్ద రోడ్లపై అడ్డదిడ్డంగా కొందరు భక్తులు తమ వాహనాలు పార్క్ చేశారు. దీంతో ఇతర భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.