యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, పైగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివ చ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు. కొండపైన ఉన్న కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి.. ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.