యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారానికి దీపావళి సెలవులు తోడవడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నరసింహుడి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. కొండ కింద కల్యాణకట్ట, పుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు.. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో సందడిగా కనిపించాయి.
స్టేట్ ఫిషరీస్ కమిషనర్ లాచిరాం భూక్యా ఆదివారం కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.33లక్షల22వేల514 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.16,16,350, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.5 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.