
పాపన్నపేట,వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో ఏడు పాయల పరిసర ప్రాంతాలు దుర్గమ్మ నామస్మరణతో మారుమోగాయి.
మహ శివరాత్రి జాతర దగ్గర పడడంతో తెలంగాణలోని జంట నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలనుంచి భక్తులు వచ్చి మంజీర పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.