- భక్తజన సంద్రమైన ఆలయం
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డున ఉన్న బాలేశ్వర స్వామి రథోత్సవానికి భక్తజనం పోటెత్తింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన జాతర, రథోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం నుంచి బాలేశ్వరుని విగ్రహాన్ని భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.
భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో పెద్ద వాగు ప్రాంతం జన సంద్రంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రథోత్సవానికి తరలివచ్చారు.