భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్ కు ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. దాదాపు 22,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు సిబ్బంది పేర్కొన్నారు.
స్వామి వారి నిత్య కల్యాణానికి 115 మంది జంటలు హాజరయ్యాయి. స్వామివారికి అర్చకులు బంగారు పుష్పార్చన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.