దామెర గుట్టకు పోటెత్తిన భక్తులు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గుట్టపై ఉగాది సందర్భంగా నిర్వహించిన ఫకీర్ షావలీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్గా వద్ద జెండాలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయాన్నే ముజావర్లు గంధాన్ని గుట్టపైకి చేర్చడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులు, ముజావర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.