ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. బుధవారం వనదేవతలకు ఇష్టమైన రోజు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో పోలీసులు భక్తులను క్యూ లైన్లలో పంపించారు. అమ్మవారి గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా చూశారు.