రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

  •     90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలు 

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.

ధర్మగుండంలో స్నానం ఆచరించి ప్రత్యేక క్యూలెన్​ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు.  కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర దగ్గర పడడంతో భక్తుల రద్దీ పెరిగింది. గుడి చెరువు మైదానం భక్తుల వెహికల్స్​తో నిండిపోయింది.