చివరి సోమవారం కావడంతో .. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చివరి సోమవారం కావడంతో .. ఆలయాలకు  పోటెత్తిన భక్తులు

ఫొటోగ్రాఫర్​/ముషీరాబాద్​, వెలుగు : కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. 

అలాగే ఎన్టీఆర్​ స్డేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవం సోమవారం ముగిసింది. ఆఖరి రోజు కావడంతో వేల మంది భక్తులు తరలివచ్చారు.