ఎములాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు సోమవారం పోటెత్తారు. శివుడికి ఇష్టమైనా రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచే అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు,  శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతు షష్టి పూజలు వేదమంత్రోత్సవాలతో నిర్వహించారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు సమర్పించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కుటుంబసమేతంగా రాజన్నను దర్శించుకున్నారు.